ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యర్రగొండపాలెంలో భారీ వర్షం..రైతన్నల హర్షం - కంది, పత్తి, మిరప, సజ్జ

చినుకు జాడ లేదని చింతిస్తున్న రైతన్న మోములో చిరు నవ్వులు కనిపిస్తున్నాయి. గత రెండు రోజులుగా యర్రగొండపాలెంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లగా, పంటలు కళకళలాడుతున్నాయి.

rains and dams are fiiled with water

By

Published : Sep 21, 2019, 3:16 PM IST

యర్రగొండపాలెంలో వర్షానికి హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు.

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.ఇప్పటికే వేసిన మెట్ట పంటలు పత్తి,కంది,మిరప పంటలకు ఈ వర్షాలు బాగా ఉపయోగపడుతున్నాయని రైతన్నలు అంటున్నారు.గత కొన్ని నెలలుగా నీటి జాడ లేక వెలవెలబోయిన చెక్ డ్యాములు ఇప్పుడు జలకళను సంతరించుకున్నాయి.భూగర్భ జలాలు పెరిగే అవకాశముందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ,వివిధరకాల పంటలు వేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.ఇప్పటికే బోర్ల కింద సాగు చేసిన కంది,పత్తి,మిరప,సజ్జ,తదితర పంటలకు ఈ వర్షంతో మేలు చేకూరుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details