Worst Rural Roads in Yerragondapalem Constituency : మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం అది. మంత్రి ఐతే తమ గ్రామాలకు వెళ్ళే రోడ్ల స్థితిగతులు మారి తమ ప్రయాణ కష్టాలు తీరుతాయనుకున్నారు. కానీ నాలుగున్నరేళ్లు ఐనా తమ బతుకుల్లో మాత్రం ఏ మాత్రం మార్పు లేదని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Non Management of Roads in Prakasam District :ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలోని పెద్దారవీడు మండలం సుంకేసుల, కలనూతల, గుండంచర్ల గ్రామాలకు వెళ్ళే రహదారి అస్తవ్యస్తంగా మారింది. ఆ గ్రామాలలో సుమారు ఆరు వేల మంది జనాభా ఉంటారు. నిత్యం ఆ రహదారి పై వివిధ పనుల నిమిత్తం వేల మంది ప్రయాణం సాగిస్తుంటారు. కొండ కు అవతలి వైపు ఉండే గ్రామాల నుంచి ఆటోలు, కార్లు, బైక్‌లపై ప్రయాణం చేస్తుంటారు. అసలే కొండలు పైగా రహదారిపై భారీ గోతులు, కంకర రాళ్ళు ఉండడంతో ప్రయాణం నరకంగా మారి వాహనాలు సైతం దెబ్బతింటున్నాయని వాహనదారులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.
People Fire on Minister Adimulapu Suresh : గర్భిణీ స్త్రీలు, అనారోగ్యం పాలైన వారిని వైద్యశాలకు తరలించాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామీణ ప్రజలు వాపోయారు. పలు సార్లు మంత్రి ఆదిమూలపు సురేష్ ఇక్కడి గ్రామాలకు వచ్చినప్పుడు రోడ్ల సమస్య ఆయన దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి నాలుగున్న సంవత్సరాలు అయిన కనీసం మంత్రి స్థాయిలో ఒక్క సారి కూడా రోడ్డు మరమ్మతులు చేయించలేని స్థితిలో ఉన్నారని అసహనం వ్యక్తం చేశారు.