ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్యం దుకాణం ఎదుట మహిళల ఆందోళన - womens protest at darshi mandal

దర్శి మండలం రాజంపల్లిలో మద్యం దుకాణాల ఎదుట మహిళలు అందోళనకు దిగారు. పొలాల నుంచి పశుగ్రాసం తెచ్చుకునేందుకు మద్యం దుకాణం మీదుగా వెళ్లాల్సి రావటంతో ఇబ్బందులకు గురవుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.

womens protest at rajam pally prakasham district
మద్యం దుకాణం ముందు మహిళల ఆందోళన

By

Published : Jun 21, 2020, 12:52 PM IST


ప్రకాశం జిల్లా దర్శి మండలం రాజంపల్లి గ్రామంలో మందుబాబుల ఆగడాలు రోజురోజుకు పెచ్చుమీరుతున్నాయని మహిళలు మద్యం దుకాణం ఎదుట ధర్నాకు దిగారు. దర్శిని కంటైన్మెంట్ జోన్​గా ప్రకటించటంతో పట్టణంలోని మందుబాబులు దగ్గరలో ఉన్న రాజంపల్లి మద్యం దుకాణానికి క్యూ కట్టారు. దుకాణం వెనుక ఉన్న చెట్ల కింద మద్యం తాగి సీసాలను అక్కడే పగులగొట్టి వెళుతున్నారని మహిళలు తెలిపారు. ఫూటుగా మద్యం సేవించిన మందుబాబులు వంటిపై ఉన్న బట్టలను విప్పేసి నృత్యాలు చేస్తున్నారని మహిళలు ఆరోపిస్తున్నారు. పొలాల నుంచి పశుగ్రాసం తెచ్చుకునేందుకు మద్యం దుకాణం మీద నుండే వెళ్లాల్సి రావటంతో ఎన్నో ఇబ్బందులకు గురౌతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వచ్చి సమస్యను ఉన్నతాధికారులకు తెలియపరుస్తామని హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు.

ఇదీచదవండి: ఆరోగ్యం బాగోలేదని... ఆయువు తీసుకుంది!

ABOUT THE AUTHOR

...view details