ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నీళ్లకోసం ఖాళీ బిందెలతో మహిళల ధర్నా - ప్రకాశం జిల్లా

పంచాయతి నీళ్లు రావడంలేదని మహిళలు ఖాళీ బిందెలెతో రోడ్డెక్కారు. నీళ్లు వచ్చే వరకు కదిలేది లేదని భీష్మించి కుర్చున్నారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో చోటుచేసుకుంది.

ధర్నాచేస్తున్న మహిళలు

By

Published : Aug 26, 2019, 10:34 AM IST

Updated : Aug 26, 2019, 1:35 PM IST

గత 3నెలలుగా పంచాయతి నీళ్లు రావడం లేదంటూ... ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పట్టణంలోని వినుకొండ గ్రామం మహిళలు ఆందోళనకు దిగారు. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేవారని ఇప్పుడు పూర్తిగా రావడం లేదని అన్నారు. సాగర్​పైప్​లైన్​ నుంచి నీరు వస్తున్నప్పటికీ అవి మురికిగా ఉన్నాయని తెలిపారు. విసుగు చెందిన మహిళలు రహదారిపై ఆందోళన చేపట్టారు. రాకపోకలకు ఆగిపోయేసరికి పోలీసులు రంగంలోకి దిగి పంచాయతి, ఆర్​డబ్ల్యూఎస్​ అధికారులతో చరవాణీలో మాట్లాడారు. నీరు సరఫరాకు హామీ ఇచ్చి మహిళలతో ధర్నా విరమింపజేశారు.

ధర్నాచేస్తున్న మహిళలు
Last Updated : Aug 26, 2019, 1:35 PM IST

ABOUT THE AUTHOR

...view details