ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దొంగతనాలకు పాల్పడుతున్న మహిళలు అరెస్ట్ - Prakasam district woman robbers arrested

గత మూడు నెలల కిందట ఓ బట్టల దుకాణంలో జరిగిన దొంగతనం కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం పుట్టవారిపాలెంలో జరిగింది.

మాయ మాటలతో దొంగతనాలకు పాల్పడుతున్న మహిళలు అరెస్ట్
మాయ మాటలతో దొంగతనాలకు పాల్పడుతున్న మహిళలు అరెస్ట్

By

Published : Nov 4, 2020, 8:24 PM IST


ప్రకాశం జిల్లా పుట్టవారిపాలెంలోని ఓ బట్టల దుకాణంలో జరిగిన దొంగతనం కేసులో నిందితులను పోలీసులు పట్టుకున్నారు. గత మూడు నెలల కిందట వెంకట సంధ్య బట్టల షాప్​లో బట్టలు కొనడానికి వెళ్లిన ఇద్దరు మహిళలే ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. గుంజి కోటేశ్వరమ్మ, శివరాత్రి తిరుపతమ్మలు యజమానితో మాటలు కలిపి కౌంటర్​లోని లక్షా 25 వేల రూపాయల నగదును అపహరించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు 3 నెలల క్రితం కేసు నమోదు చేశారు. బుధవారం నిందితులిద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.

ABOUT THE AUTHOR

...view details