ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం పాతమాగులూరుకు చెందిన ఓ మహిళకు కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. ఫలితంగా బాధితురాలు ఒంగోలులోని రైస్ కళాశాల ఐసోలేషన్ కేంద్రంలో చికిత్స పొందుతోంది. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన ఆమె... ఐసోలేషన్ కేంద్రం నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కరోనా సోకిందని మనస్తాపంతో మహిళ ఆత్మహత్య - ongole crime news
ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఐసోలేషన్ కేంద్రం భవనం పైనుంచి దూకి ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. కరోనా సోకటంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని స్థానికులు చెబుతున్నారు.

కరోనా సోకిందని మనస్తాపంతో మహిళ ఆత్మహత్య