ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉరేసుకుని వివాహిత మృతి... లేఖ లభ్యం - markapuram crime news

ఫ్యాన్​కు ఉరేసుకుని వివాహిత మృతి చెందింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగింది. పోలీసులు ఓ లేఖను స్వాధీనం చేసుకున్నారు.

women suicede
మార్కాపురంలో వివాహిత మృతి

By

Published : Apr 10, 2021, 7:35 AM IST

ప్రకాశం జిల్లా మార్కాపురంలోని మధుప్రియ అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఉదయం నుంచి ఎంతసేపటికీ ఇంట్లో నుంచి బయటకి రాకపోవడంపై.. ఎదురింటి వాళ్లు గమనించి సమీపంలోని బంధువులకు సమాచారం ఇచ్చారు. కిటికిలోనుంచి చూడగా ఫ్యాన్​కు ఉరేసుకుని ఉంది. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు.

ఆమె భర్త శ్రీనివాస్ గుంటూరులోని అటవీ శాఖ కార్యాలయం ఉద్యోగిగా పనిచేస్తున్నారు. మృతదేహం వద్ద లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన చావుకు కారణం ఆ వీధి వాళ్లేనని.. తన జీవితాన్ని చేశారంటూ లేఖలో మధుప్రియ పేర్కొన్నట్లు తెలిసింది.

ABOUT THE AUTHOR

...view details