ప్రకాశం జిల్లా కనిగిరిలో దారుణం జరిగింది. ఓ వివాహిత హత్యకు గురైన ఉదంతం వెలుగు చూసింది. కనిగిరిలోని శివారు ప్రాంతమైన బొగ్గులగొంది కాలనీ ప్రాంతంలో వెంకటలక్ష్మీ అనే మహిళ నివాసముంటుంది. భర్త మరణించడంతో పశువులను మేపుకుంటూ తన సోదరుడి వద్ద ఉంటోంది. రోజు లాగా పశువులను తోలుకుని కనిగిరి శివారు కొండ ప్రాంతానికి వెళ్లింది. సాయంత్రం అయినా తిరిగి రాక పోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపు చేపట్టారు. బొగ్గులగొంది శివారులో ఆమె మృతదేహం లభ్యమైంది. హత్యాచారం చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఫోరెన్సిక్, క్లూస్ టీం బృందాలతో విచారణ చేపట్టనున్నట్లు సీఐ పాపారావు తెలిపారు. ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామని సీఐ చెప్పారు.
కనిగిరిలో దారుణం.. హత్య చేసి.. పూడ్చి పెట్టి.. - kanigiri crime news latest
కనిగిరిలో దారుణం జరిగింది. పశువులను మేపేందుకు వెళ్లిన వివాహితపై కన్నేసిన గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను కిరాతకంగా హతమార్చారు. హత్యాచారం చేసి ముఖం గుర్తు పట్టలేని విధంగా చిధ్రం చేశారు. అనంతరం పూడ్చి పెట్టారు. కుటుంబ సభ్యుల సమాచారంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించి గాలింపు చేపట్టగా బొగ్గులగొంది శివారులో మృతదేహం లభ్యమైంది.
kanigiri news
ఇదీ చదవండి:'పోలీసుల దెబ్బలు తాళలేక భవనంపై నుంచి దూకా'
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!