ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నా ఉద్యోగం నాకు ఇప్పించడి... ఓ మహిళ వేడుకోలు - prakasam district aagan wadi teacher problem

పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులతో తన విధిరాత మారింది. జీవితాంతం తోడుంటాడనుకున్న భర్త మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు. బతుకు భారమైన ఆమెకు అంగన్వాడీ ఉద్యోగం ఇచ్చింది ప్రభుత్వం. కానీ.. తోటి ఉద్యోగుల ఫిర్యాదుతో ఆ ఆసరా లేకుండాపోయి రోడ్డుపై పడింది. తన ఉద్యోగం తనకు ఇప్పించాలని కార్యాలయాల చుట్టూ తిరుగుతోంది.

నా ఉద్యోగం నాకు ఇప్పించడి

By

Published : Nov 19, 2019, 10:48 AM IST

ప్రకాశం జిల్లా కురిచేడు మండలం కల్లూరుకు చెందిన కళావతికి దోర్నాల మండలం బొమ్మలపాలెంకు చెందిన వ్యక్తితో 30 సంవత్సరాల క్రితం వివాహమైంది. 1992వ సంవత్సరంలో మావోయిస్టులు పోలీసుల మధ్య జరిగిన కాల్పుల్లో గొర్రెలు కాచుకుంటున్న కళావతి భర్త నుదిటికి బుల్లెట్ తగిలి మృతి చెందాడు. పోలీసులు అప్పుడు గోప్యంగా ఉంచే ప్రయత్నం చేసినా బయటకు పొక్కింది. భర్త చనిపోయి కుటుంబ పోషణ కష్టంగా ఉందని.. ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని కళావతి ప్రభుత్వాన్ని వేడుకుంది. కాళ్లరిగేలా అధికారుల చుట్టూ తిరిగింది. ఎట్టకేలకు 2013లో కల్లూరులో అంగన్వాడీ ఉధ్యాయురాలిగా ఉద్యోగం సంపాదించింది. ఆరు నెలలు చేసిందో లేదో 9వ తరగతి విద్యార్హతే ఉందని... కొంతమంది కోర్టులో కేసులు వేయగా ఆమెను తొలగించారు. అప్పటినుంచి తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలంటూ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది. కుటుంబం నడవడం కష్టంగా ఉందని తాను పదో తరగతి ధ్రువ పత్రాలు అందించినా... కోర్టుకు మాత్రం 9 తరగతి పత్రాలు అందించి కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని వాపోతుంది కళావతి.

ఉద్యోగంకోసం తిరుగుతున్న కళావతి

ABOUT THE AUTHOR

...view details