ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కనిగిరిలో కరోనా పరీక్షలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంజీవని బస్సు వద్దకు వచ్చిన ఆర్టీసీ మహిళా కండక్టర్ మల్లీశ్వరి స్పృహ తప్పి పడిపోయింది.
మూడు రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతుండగా కరోనా పరీక్షల నిమిత్తం సంజీవని బస్సు దగ్గరకు వచ్చిన మల్లేశ్వరి ఒక్క సారిగా సృహ తప్పి పడిపోయింది. వెంటనే స్పందించిన అక్కడి వైద్య సిబ్బంది, ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.