మహిళా సాధికారత కోసం ముఖ్యమంత్రి జగన్ కృషిచేస్తున్నారని.... మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. ప్రకాశం జిల్లా చీరాలలో నిర్వహించిన మహిళా మార్చ్@100 రోజులు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అందులో భాగంగా బాధిత మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మహిళల భద్రతే లక్ష్యంగా... రాష్ట్ర ప్రభుత్వం దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసిందని వాసిరెడ్డి పద్మ అన్నారు. రాష్ట్రంలో ఉన్న మహిళా చట్టాలను ఉపయోగించుకోవాలని సూచించారు.
'మహిళా సాధికారత కోసం ముఖ్యమంత్రి జగన్ కృషి' - news updates in chirala
ప్రకాశం జిల్లా చీరాలలో మహిళా మార్చ్@ 100రోజులు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ హాజరయ్యారు. మహిళా సాధికారత కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు.

మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ