ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కనిగిరిలో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి - కనిగిరి క్రైం

ప్రకాశం జిల్లా కనిగిరిలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అత్తింటి వారే తన కుమార్తెను చంపి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Woman suspected death in kanigiri prakasham district
కనిగిరిలో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

By

Published : Sep 4, 2020, 10:50 PM IST

ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలోని సుభాష్ రోడ్డు​లో భ్రమరాంబిక అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈమెకు మూడు సంవత్సరాల క్రితం చీరాలవాసి ఆంధ్రా బ్యాంకు మేనేజర్ సిరిగిరి లింగారావుతో వివాహమైంది. ఆ సమయంలో కట్నంగా భారీగా డబ్బు, బంగారం ఇచ్చామని మృతురాలి తండ్రి రామకృష్ణారావు తెలిపారు.

అయినా... అదనపు కట్నం కోసం అల్లుడు లింగారావు తన కుమార్తెను వేధించేవాడని అతని తల్లి లింగమ్మ, తమ్ముళ్లు, చెల్లెలు అందరూ కలసి భ్రమరాంబికను దారుణంగా కొట్టి, చంపేశారని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details