ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కనిగిరిలో ఒంటరిమహిళ దారుణ హత్య.. - crimes and accidents IN AP

Woman found brutally murdered: కనిగిరి పట్టణంలో సుశీల (35)అనే ఒంటరి మహిళను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. హత్యకు ఆస్తి గొడవలా, లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. మరో ఘనటలో కర్నూలు జిల్లాలో పింజరి హుస్సేన్ హత్యకు సంబంధించిన దోషులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని కోర్టులో హాజరు పరచనున్నట్లు వెల్లడించారు.

murdered
murdered

By

Published : Apr 5, 2023, 5:39 PM IST

Updated : Apr 5, 2023, 6:41 PM IST

Woman found brutally murdered: ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని ఓ మహిళను గుర్తు తెలియని వ్యక్తులు మారణాయధాలతో కొట్టి హత్య చేశారు. మృతదేహం పక్కన ఉన్న ఆనవాళ్లను బట్టి హత్య చేసినట్లు అనుమానాలు రేకెత్తుతున్నాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని, పరిసర ప్రాంతాలని పరిశీలించిన పోలీసులు జాగిలాలను తెప్పించే పనిలో పడ్డారు.

హత్యకు గురైన మహిళ: కనిగిరి పట్టణంలో స్థానిక కాశినాయన దేవస్థానం సమీపంలో సుశీల (35)అనే మహిళ ఒంటరిగా నివాసం ఉంటుంది. ఈ రోజు ఆమె రక్తపు మడుగులో నిర్జీవంగా పడి ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు హత్యకు గురైన మహిళ మృతదేహాన్ని, చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించి మృతదేహం పక్కనే పడి ఉన్న కత్తిని గుర్తించారు. మృతురాలి వద్ద లభించిన ఆధారాలను బట్టి మహిళను మారణాయుధాలతో దారుణంగా దాడి చేసి చంపి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. చుట్టుపక్కల వారిని పోలీసులు విచారించగా.. మృతురాలికి ఆమె తమ్ముడికి మధ్య గత కొంతకాలంగా ఆస్తి తగాదాలు ఉన్నాయని తెలిపారు. అప్పుడప్పుడు వివాదాలు కూడా చోటుచేసుకున్నాయని పోలీసులకు చుట్టుపక్కల వారు తెలిపారు. దీంతో పోలీసులు మృతురాలి తమ్ముడిని అదుపులోకి తీసుకొన్నారు. అనంతరం అతన్ని పోలీస్ స్టేషన్​కు తరలించారు. హత్య ఘటనపై వివిధ కోణాల్లో విచారణ చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

హత్య కేసును ఛేదించిన పోలీసులు: కర్నూలు జిల్లా కౌతాళం మండలం హల్వి గ్రామంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. వారం రోజుల క్రితం వల్లూరు క్రాస్ దగ్గర పింజరి హుస్సేన్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనపై గతంలో కౌతాళం పోలీసులు కేసు నమోదు చేశారు. హత్య కేసు సూత్రధారులు నలుగురిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. మసీదు స్థలం విషయంలో ఇద్దరి మధ్య గొడవ వల్ల హత్య జరిగినట్లు డీఎస్పీ వినోద్ కుమార్ వెల్లడించారు. నలుగురు నిందితులతో పాటు మారణాయుధాలు, రెండు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.

అంతర్ జిల్లా దొంగ: వైఎస్ఆర్ కడప జిల్లా చింతకొమ్మదిన్నెలో వెంకటసుబ్బయ్య అనే అంతర్ జిల్లా దొంగను పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి 1.90 లక్షలు విలువ చేసే బంగారు నగలు స్వాధీన పరుచుకున్నారు. వైయస్సార్ జిల్లా మైదుకూరు మండలం కుమ్మరి కొట్టాలు గ్రామానికి చెందిన వెంకటసుబ్బయ్య పలు ప్రాంతాలలో నివాసాలలో చోరీలకు పాల్పడుతున్నాడని పోలీసులు పేర్కొన్నారు. వెంకటసుబ్బయ్య దాదాపు మూడు జిల్లాలలో 15 ప్రాంతాలలో చోరీలకు పాల్పడ్డినట్లు పోలీసులు తెలిపారు. ఇతనిపై గతంలోనే పీడీ యాక్ట్ నమోదు చేసినప్పటికీ మార్పు రాలేదని పోలీసులు తెలిపారు. మళ్లీ చోరీ చేస్తూ అడ్డంగా దొరికిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. తాళాలు వేసిన ఇండ్లనే లక్ష్యంగా దొంగతనం చేస్తాడని తెలిపారు. కడప, నెల్లూరు, తిరుపతి తదితర జిల్లాలలో ఇతనిపై పలు కేసులు నమోదయినట్లు వెల్లడించారు.

ఇవీ చదవండి:

Last Updated : Apr 5, 2023, 6:41 PM IST

ABOUT THE AUTHOR

...view details