ప్రకాశం జిల్లా కనిగిరిలో కరోనా మహమ్మరి ఓ మహిళను బలి తీసుకుంది. ఈ విషయం కాలనీ వాసులకు తెలియటంతో భయాందోళనకు గురయ్యారు. మృతురాలి కుమారుడు పంచాయతీ కార్యదర్శిగా విధుల చేస్తున్నప్పటికీ అధికారులకు సమాచారం ఇచ్చిన మరుసటి రోజు మధ్యాహ్నం వరకు ఏ ఆధికారి స్పందించలేదు. కుమారుడు.. చుట్టుపక్కల వారిని బతిమలాడినా అంత్యక్రియలు నిర్వహించేందుకు ఒక్కరూ ముందుకు రాలేదు. కరోనాతో మృతి చెందిన విషయం స్థానిక తహసీల్దార్, కమిషనర్‌కు తెలియటంతో స్పందించిన వారు.. సిబ్బందిని పంపించి అంత్యక్రియలు నిర్వహించారు.
కనిగిరిలో కరోనాతో మహిళ మృతి - ప్రకాశం జిల్లాలో కరోనాతో మహిళ మృతి
కనిగిరిలో ఓ మహిళ కరోనాతో నిన్న మృతి చెందింది. ఈ విషయం కాలనీ వాసులకు తెలియటంతో భయందోళనకు గురయ్యారు. అధికారులకు సమాచారం అందించినప్పటికి మరుసటి రోజు మధ్యాహ్నం వరకు ముందుకు రాలేదు.
కనిగిరిలో కరోనాతో మహిళ మృతి