ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం పులికొండలో బుల్డోజరును బైక్ ఢీకొన్న ఘటనలో ఓ మహిళ మృతిచెందింది. రావిపాడుకు చెందిన భార్యాభర్తలు చీమకుర్తి వైపు ద్విచక్రవాహనంపై వెళ్తూ బుల్డోజరును ఢీకొన్నారు. ఈ ఘటనలో బైక్ వెనుక కూర్చున్న తులసమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. భర్తకు స్వల్ప గాయాలయ్యాయి. చీమకుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బుల్డోజరును ఢీకొన్న బైక్.. మహిళ మృతి - చీమకుర్తిలో రోడ్డు ప్రమాదం వార్తలు
బుల్డోజరును ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో ఓ మహిళ మృతిచెందింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా పులికొండలో జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన మహిళ