ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా జిల్లా కార్యదర్శిని.. నాతో పెట్టుకోకండి! - woman cheating with name of finance

ఇల్లు కట్టుకునేందుకు 30 లక్షలు ఇస్తాం. వ్యక్తిగత రుణం కావాలంటే 3 లక్షలు ఇస్తాం. మీకు ఇంత కావాలంటే.. మాకు ముందు కొంత ఇవ్వాలి. ఆ వెంటనే.. కావాల్సినంత రుణం ఇచ్చేస్తాం.. అంటూ అడ్డగోలు మాటలు చెప్పిన ఓ కిలేడీ.. అందినకాడికి దోచుకుంది. దాదాపు 150 మంది మహిళల దగ్గర.. లక్షలు వసూలు చేసింది. తీరా పోలీసులకు చిక్కాక.. తానూ బాధితురాలినే.. అంటూ పొంతన లేని ముచ్చట్లు చెబుతోంది

నేను వైకాపా జిల్లా కార్యదర్శిని.. నాతో పెట్టుకోకండి!

By

Published : Jun 12, 2019, 4:05 PM IST


పేదవాళ్ల అవసరాలను, ఆశలను ఆసరాగా తీసుకుంది ఓ మహిళ. ఇంటి రుణం, వ్యక్తిగత రుణాలు.. ఆఖరుకు వృద్ధాప్య పెన్షన్లు సైతం ఇప్పిస్తానని మాయ మాటలు చెప్పింది. బాధితుల నుంచి దండిగా డబ్బులు వసూలు చేసింది. మదర్ బేబీ ఫౌండేషన్ పేరుతో జనాలకు మాయమాటలు చెప్పి ఘారానా మోసానికి తెరలేపింది. అసలు విషయం తెలుసుకున్న బాధితులు మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు.
150 మంది మహిళలు.. లక్షల్లో వసూళ్లు
రుణాలు ఇప్పించేందుకు ముందు.. తనకు 25 వేలు చెల్లించాలంటూ.. సల్మా సుభాహాన్ అనే మహిళ.. కొత్తపట్నం, ఈతముక్కల, పల్లెపాలెం గ్రామాలకు చెందిన మహిళలను బురిడీ కొట్టించింది. కొటేషన్లు తీసుకురావాలని ఒంగోలు వీఐపీ రోడ్డులోని ఆమె ఇంటి చుట్టూ తిప్పుకొంది. కొందరికి లోన్ మంజూరు అయ్యింది అంటూ మరోసారి 45 వేల వరకూ వసూలు చేసింది. ఇలా... మూడు గ్రామాల్లో సుమారు 150 మంది మహిళల నుంచి లక్షల్లో దండుకుంది. నాలుగు నెలలు పాటు సల్మా ఇంటి చుట్టూ తిరిగిన మహిళలకు.. తాము మోసపోయామని అర్థమైంది. నిలదీసి అడగితే.. ఆ మహిళలతో తనకు ఏం సంబంధం లేదంటూ ప్లేటు తిప్పేసింది. మళ్లీ వస్తే బాగోదంటూ.. బెదిరింపులకు దిగింది. తాను వైకాపా జిల్లా కార్యదర్శిని అని తనతో పెట్టుకోవద్దంటూ హెచ్చరించింది. చేసేది లేక.. బాధితులు ముస్లిం జాగరణ మంచ్ సహాయంతో ఎస్పీని కలిశారు. తమ గోడు వెళ్లబోసుకున్నారు.
నేను బాధితురాలినే..
బాధితుల గోడు ఒకలా ఉంటే.. సల్మా మాత్రం మరోలా చెప్పుకొస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా నడిచే మదర్ బేబీ ఫౌండేషన్ సంస్థ రుణాలు ఇస్తా నంటే తానూ కట్టినట్టు చెబుతోంది. అందరిలాగే.. తానూ భాదితురాలినే అని చెప్పి షాక్ ఇచ్చింది. మదర్ బేబీ ఫౌండేషన్ రుణాలు అందిస్తుందన్న నమ్మకంతో నేను బాధితుల అందరి చేత డబ్బులు కట్టించానని ఒప్పుకుంది. ఆ సంస్థ తనతోపాటు అందరినీ మోసం చేసిందని ఆరోపించింది.
బాధితులు మాత్రం ఆ సంస్థ పేరుతో ఇక్కడ అన్ని వ్యవహారాలు సల్మా నే చక్కబెట్టేదని ఆరోపిస్తున్నారు. డబ్బులు ఇప్పించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details