ప్రకాశం జిల్లా అద్దంకి మండలం ధర్మవరంలో దారుణం జరిగింది. భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదంలో భార్య ప్రాణాలు కోల్పోయింది. గ్రామానికి చెందిన పోలయ్య, రుక్మిణమ్మల మధ్య బుధవారం రాత్రి గొడవ జరిగింది. ఇది కాస్తా పెద్దది కావటంతో, ఆగ్రహంతో పోలయ్య రుక్మిణమ్మను తీవ్రంగా కొట్టారు. భర్త దాడిలో తీవ్రంగా గాయపడిన రుక్మిణమ్మను స్థానికులు అద్దంకి ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్థరించారు.
భర్త దాడిలో భార్య మృతి - husband kills wife update
భర్త దాడిలో భార్య మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా ధర్మవరంలో జరిగింది. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
భర్త దాడిలో భార్య మృతి
ఆమె మృతి చెందలేదనీ, పెద్దాసుపత్రికి తరలించి వైద్యం చేయిస్తామని రుక్మిణమ్మ కుటుంబ సభ్యులు వైద్య సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. మృతదేహాన్ని ఆటోలో తరలిస్తుండగా, సమాచారం అందుకున్న ఎస్సై మహేష్ ఆటోను వెంబడించి, భవానీ కూడలి వద్ద ఆపారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి, మృతదేహాన్ని శవాగారానికి తరలించారు. ప్రస్తుతం పోలయ్య పరారీలో ఉన్నట్లు ఎస్సై వివరించారు.
ఇదీ చదవండి:ఒంగోలు యువకుడి హత్య కేసు.... సీసీ పుటేజీలో దృశ్యాలు