ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తాను లేడని తెలిసి.. తనువు చాలించి... - ప్రకాశంలో భార్య, భర్త మృతి తాజా వార్తలు

మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. అన్యోన్య జీవనం సాగించారు. పిల్లలను పెంచి పెద్ద చేశారు. వారినీ ఓ ఇంటి వారిని చేశారు. వృద్ధాప్యంలో కుమారుల వద్ద ఉంటూ జీవనం సాగిస్తున్నారు. ఆ క్రమంలోనే మృత్యువు అతన్ని.. ఆమె నుంచి దూరం చేసింది. భర్త ఇక రాడని తెలిసిన ఆమె కూడా గంటల వ్యవధిలోనే తనువు చాలించింది.

wife and husband died with in short period of time at Marella at prakasham district
తాను లేడని తెలిసి..తనువు చాలించి

By

Published : Feb 28, 2020, 1:50 PM IST

తాను లేడని తెలిసి..తనువు చాలించి

ప్రకాశంజిల్లా ముండ్లమూరు మండలం మారెళ్లలో విషాదం చోటు చేసుకుంది. సన్నెబోయిన సుబ్బారావు, సుబ్బులు అన్యోన్య దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. అందరికీ పెళ్లిళ్లు చేశారు. దంపతులిద్దరూ కుమారుల వద్ద ఉంటూ జీవనం సాగిస్తున్నారు. సుబ్బారావు వయసు పైబడటంతో బుధవారం అనారోగ్యంతో మృతి చెందారు. భర్త ఇక లేడనే విషయం తెలుసుకున్న భార్య సుబ్బులు గుండెలవిసేలా విలపించింది. ఆ క్రమంలోనే సొమ్మసిల్లి పడిపోయింది. వైద్యం అందించినప్పటికీ.. ఆమె పరిస్థితి విషమించి గురువారం సాయంత్రం ప్రాణాలు విడిచింది. భర్త మృతి చెందిన 16 గంటల్లోపే భార్య తనువు చాలించిన ఈ విషాదం అందరిని కలచివేసింది.

ABOUT THE AUTHOR

...view details