ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అందరీ చూపు చీరాల, పర్చూరు వైపే!

చీరాల, పర్చూరు నియోజకవర్గంలో పోటీ రెండు నెలల ముందే ప్రారంభమైంది. చీరాలలో బలరామకృష్ణమూర్తి, ఆమంచి కృష్ణమోహన్​.... పర్చూరులో ఏలూరి సాంబశివరావు, దగ్గుబాటి వెంకటేశ్వరరావులు బరిలో ఉండగా.. ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ నెలకొంది. ప్రజలంతా ఎవరు గెలుస్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఉత్కంఠ వీడాలంటే గురువారం వరకు నిరీక్షించాలి.

By

Published : May 21, 2019, 10:06 PM IST

Published : May 21, 2019, 10:06 PM IST

అందరి కన్ను చీరాల, పర్చూరు వైపే

చీరాల, పర్చూరులో గెలుపెవరిది..?

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ప్రధానంగా ప్రకాశం జిల్లాపై అందరీ చూపు ఉంది... చీరాల, పర్చూరు నియోజకవర్గంలో పోటీ ఉత్కంఠగా మారింది. చీరాలలో ఎన్నికలకు రెండు నెలల ముందే ఎన్నికలవేడి రగిలింది... గెలుపే ధ్యేయంగా ఇరుపార్టీలు అస్త్రశస్త్రాలతో రంగంలోకి దిగాయి. జిల్లాల్లో తెదేపాకు పెద్దదిక్కుగా ఉన్న కరణం బలరామకృష్ణమూర్తి చీరాలలో పసుపుజెండా ఎగురవేస్తారా... వైకాపా తరపున పోటీ చేసిన ఆమంచి కృష్ణమోహన్ తన పట్టును నిలుపుకుంటారా... అనేది 23వ తేదీన తేలనుంది... మరో నియోజకవర్గమైన పర్చూరు ఫలితంపై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఐదేళ్లలో తాను చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్ళిన తెదేపా అభ్యర్థి ఏలూరి సాంబశివరావు ఒకపక్క ... ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైకాపా తరపున మరో పక్క బరిలో నిలిచారు. దీంతో పర్చూరు నియోజకవర్గం గెలుపుపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అయితే గెలుపుపై ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. దీంతో ప్రజలంతా చీరాల, పర్చూరు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

ఇవీ చదవండి..ఫలితాల లెక్కింపు దృష్ట్యా జిల్లా ఎస్పీ సమీక్ష

ABOUT THE AUTHOR

...view details