ఏటీఎంలో డబ్బును పెట్టే ఉద్యోగులే బ్యాంకును మోసం చేసి రూ.22లక్షలకు పైగా కాజేశారు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. వారిని పోలీసులు అరెస్ట్ చేసారు.
కరూర్ వైశ్యా బ్యాంక్ ఏటీఎం సెంటర్స్‌లో నలుగురు నగదు నింపే ఉద్యోగం చేస్తున్నారు. ఏటీఎం సెంటర్స్‌లో నగదు పెట్టే సమయంలో కంపెనీకి సంబంధించిన మెయిన్ సర్వీస్ ప్రొవైడర్ నుంచి వచ్చిన ఓటీపీ ద్వారా ఏటీఎం మిషన్లను ఓపెన్ చేస్తారు. నగదు నింపే సమయంలో.. బాస్కెట్లో మిగిలిన ఉన్న నగదును తస్కరిస్తుంటారు. ఆ నగదుకు సంబంధించిన వివరాలు కంపెనీకి, సంబంధిత బ్యాంకుకు తెలియజేయకుండా మోసం చేశారు.
మద్దిపాడు పీఎస్ పరిధిలో రూ.12.83 లక్షలు, ఒంగోలు తాలూకా పరిధిలో రూ. 2.48 లక్షలు, ఒంగోలు వన్ టౌన్ పరిధిలో రూ. 53 వేలు, ఒంగోలు టూ టౌన్ పరిధిలో రూ.6.83 లక్షలను దుర్వినియోగం చేసినట్లు బ్యాంక్ అధికారులు గుర్తించారు.