గంజాయి అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను ప్రకాశం జిల్లా చిన్నగంజాం పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి కిలోకి పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. చిన్నగంజాం పట్టణంలోని మార్కెట్ కూడలిలో ఒక ఇంట్లో గంజాయి అమ్ముతున్నారనే సమాచారంతో... ఇంకొల్లు సీఐ సిబ్బందితో దాడి చేశారు. వెంకటేశ్వర్లు, కరెద్దుల శివ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకుని సరుకును పట్టుకున్నారు. విశాఖ నుంచి గంజాయిని తీసుకొచ్చి చిన్న పొట్లాలుగా తయారుచేసి అమ్ముతున్నట్లు విచారణలో తేలిందని సీఐ తెలిపారు.
చినగంజాంలో గంజాయి పట్టివేత... ఇద్దరు అరెస్ట్ - చిన్నగంజాంలో గంజాయి పట్టివేత...ఇద్దరు అరెస్ట్
ప్రకాశం జిల్లా చినగంజాంలో గంజాయి అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి కిలోకు పైగా సరుకు స్వాధీనం చేసుకున్నారు.
చిన్నగంజాంలో గంజాయి పట్టివేత