రైతుల సమస్యలను ప్రభుత్వం తీర్చే వరకు తెదేపా తరఫున పోరాడతామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. కరోనా నిబంధనలు తొలగిపోయాక చలో అమరావతికి పిలుపునిస్తామని, ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తామని చెప్పారు. నివర్ తుపానుతో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించి... రైతులను పరామర్శించడానికి ప్రకాశం జిల్లాలో లోకేశ్ పర్యటించారు. కారంచేడులో రైతులతో ముఖాముఖి నిర్వహించారు.
ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రావడం లేదని... తుపానుకు రైతులు తీవ్రంగా నష్టపోతే కనీసం పట్టించుకోలేదని విమర్శించారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు 30వేల రూపాయలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. 15 లక్షల కౌలు రైతులను ఆదుకోవాలని అన్నారు. అలాగే వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. విద్యుత్ మీటర్లు అమర్చితే అధికార పార్టీ నేతలు గ్రామాల్లో తిరగలేని పరిస్థితి వస్తుందన్నారు.