ప్రకాశం జిల్లా వరదాయిని అయిన పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ఈ ఏడాదే పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని విద్యాశాఖ మంత్రి సురేష్ చెప్పారు. జిల్లాలోని యర్రగొండపాలెంలో మార్కెట్ యార్డ్ ఛైర్మన్ ప్రమాణ స్వీకారానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వెలిగొండ ప్రాజెక్టు మొదటి సొరంగం పనులను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. నిర్వాసితుల సమస్యలను తీర్చేందుకు ముఖ్యమంత్రితో చర్చిస్తామని తెలిపారు. గిద్దలూరు, మార్కాపురం, మాచర్ల, నరసరావుపేట శాసనసభ్యులు పాల్గొన్నారు.
వెలిగొండను ఈ ఏడాదే పూర్తి చేస్తాం:మంత్రి సురేశ్ - ప్రకాశం జిల్లా వార్తలు
ప్రకాశం జిల్లా వాసులకు ఎన్నో ఏళ్లుగా అందని ద్రాక్షలా మారిన వెలిగొండ ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేశ్ హామీ ఇచ్చారు.
![వెలిగొండను ఈ ఏడాదే పూర్తి చేస్తాం:మంత్రి సురేశ్ minister suresh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6025822-701-6025822-1581344844848.jpg)
minister suresh
వెలిగొండను ఈ ఏడాదే పూర్తి చేస్తాం:మంత్రి సురేశ్
ఇదీ చదవండి: