ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గొంతెండుతోంది.. ఐదురోజులకు ఒకసారి తాగునీటి సరఫరా

WATTER PROBLEM: వేసవికి ముందే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో దాహం కేకలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలపై అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. సమస్య శాశ్వత పరిష్కారం కోసం చర్యలు పక్కన పెడితే.. చివరకు ట్యాంకర్లను సైతం సిద్దం చేయలేని దుస్థితి కనిపిస్తోంది. పశ్చిమ ప్రకాశం జిల్లాలో ఐదురోజులకోసారి వస్తున్న తాగునీరు స్థానికుల దాహార్తిని తీర్చలేకపోతోంది.

Etv Bharat
Etv Bharat

By

Published : Feb 23, 2023, 12:21 PM IST

Updated : Feb 23, 2023, 12:47 PM IST

గొంతెండుతోంది.. ఐదురోజులకు ఒకసారి తాగునీటి సరఫరా

WATTER PROBLEM IN PRAKASHAM: రాష్ట్రంలో వేసవికి ముందే ప్రజల గొంతెండుతోంది. అధికారులు ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో తాగునీరందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలోని ఫ్లోరైడ్‌ ప్రభావిత ప్రాంతాల్లో సురక్షిత తాగునీరు అందించాల్సిన ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. శాశ్వతంగా సమస్య పరిష్కరించాల్సిన నేతలు అదిగో ఇదిగో.. అంటూ.. కాలం నెట్టేస్తున్నారు. గత వేసవిలోనూ ఇదే సమస్య. మళ్లీ ప్రమాద గడియలు దాపురిస్తున్నాయి. ప్రజలు తాగు నీటి కోసం రోడ్డెక్కుతున్నారు. మళ్లీ ఏదే సీన్ రిపీట్ అవుతోంది.

ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో తాగునీటి సమస్య ఏడాది పొడవునా వేధిస్తుంది. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా దాహం కేకలు వినిపిస్తాయి. నగర పంచాయతీ అయిన కనిగిరి పట్టణంలో పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది. తాగునీరు సక్రమంగా అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణ శివారు ప్రాంతాల పరిస్థితి మరీ దారుణంగా తయారయ్యింది. పట్టణంలో ఉన్న 20 వార్డుల్లో రోజుకు 25 ట్యాంకులతో 318 ట్రిప్పులు తాగునీటిని సరఫరా చేయాలి. ఆ నీటిని ప్రతీ ఇంటి ముందు డ్రమ్ముల్లో పోయించుకొని వినియోగించుకుంటారు. మళ్ళీ ట్రిప్పులు వచ్చే వరకూ ఈ నీటినే జాగ్రత్తగా వాడుకోవాలి. ఒకో సారి ట్యాంకులు రాకపోతే తమ పరిస్థితి దారుణంగా తయారవుతుందని పట్టణ వాసులు పేర్కొంటున్నారు.

బిల్లులు..మొరాయిస్తున్న గుత్తేదారులు: కటారిపాలెం, కాశిరెడ్డి కాలని, బొగ్గులగొంది కాలని, ఇందిరా కాలని, శివనగర్‌ కాలని, శంక వరం, ఉప్పు రోడ్డు తదితర ప్రాంతాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఇక్కడకు ట్యాంకుల ద్వారా చేస్తేనే దిక్కు అయితే ట్యాంకుల ద్వారా నీటిని పంపిణీ చేసే గుత్తేదారులకు కోట్ల రూపాయల బిల్లులు బకాయిలున్నాయి. బిల్లులు రాకపోవడంతో నీటిని సరఫరా చేసేందుకు గుత్తేదారులు మొరాయిస్తున్నారు. 25 ట్యాంకులకు గాను ప్రస్తుతానికి రెండు ట్యాంకులు మాత్రమే సరఫరా చేస్తున్నారు. ఇంత జనాభాకు చాలీ చాలని నీటి సరఫరా వల్ల జనం ఇక్కట్లకు గురవుతున్నారు.

ప్రభుత్వం వైఫల్యానికి నిదర్శనం: ప్రజల అవసరాలకు తగ్గట్టు నీటిని సరఫరా చేయడంలో ముందస్తు చర్యలు చేపట్టకపోవడం ప్రభుత్వం వైఫల్యానికి నిదర్శనమని పలువురు విమర్శిస్తున్నారు.

ఇవీ చదవండి

Last Updated : Feb 23, 2023, 12:47 PM IST

ABOUT THE AUTHOR

...view details