Water Release from Rallapadu project: ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి ప్రకాశం జిల్లా రాళ్లపాడు జలాశయానికి వరద ప్రవాహం వస్తోంది. వరద పెరగడంతో జలాశయం 5 గేట్లను ఎత్తి అధికారులు.. దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 37,169 క్యూసెక్కుల వరద ప్రహహం వస్తుండగా.. ఔట్‌ఫ్లో 40,325 క్యూసెక్కులుగా ఉంది.
ప్రమాదంలో పామూరు పాత చెరవు...
Rains in Prakasam district: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు పామూరు వద్ద పాత చెరువు తెగిపోయే ప్రమాదం ఉంది. దాంతో గ్రామస్థులు భయాందోళనకు గురువుతున్నారు. అలాగే జిల్లాలోని పలు వాగులకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. బొట్లగూడూరు సమీపంలో నేరెళ్లవాగు ఉద్ధృతి దృష్ట్యా.. పామూరు-కందుకూరు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పి.సి.పల్లి మండలం బట్టుపల్లి వద్ద పాలేటిపల్లి వాగు, పామూరు మండలం రేణుమడుగు వద్ద మన్నేరు వాగు, రాచర్ల మండలం పలకవీడు వద్ద ఉప్పువాగు ఉద్ధృతి పెరిగింది.