ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుండ్లకమ్మ పరిధిలో తాగునీరు ఇప్పించండి మహాప్రభో

ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో తాగు నీటి సమస్యతో గ్రామాలు విలవిలాడుతున్నాయి. గండ్లకమ్మ ప్రాజెక్టులో పేరుకుపోయిన నీటినే వదలడంతో, వ్యాధులు సంక్రమించి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు.

తీరని నీటి కష్టాలు... ఇబ్బందులు పడుతున్న ప్రజలు

By

Published : Sep 7, 2019, 3:55 PM IST

తీరని నీటి కష్టాలు... ఇబ్బందులు పడుతున్న ప్రజలు

ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలో తాగునీటి కోసం ఏర్పాటు చేసిన గుండ్లకమ్మ ప్రాజెక్టు నీటిని90గ్రామాల కోసం ప్రతిపాదించారు.అయితే,ఇటీవల కురిసిన వర్షాలతో కొద్దిపాటి నీరే నిలచింది.ఈ నీటినే అధికార్లు గ్రామాలకు వదులడంతో,నీరు దుర్వాసన రావడంతో పాటు క్రిమికీటకాలు నీటిలో కనిపిస్తున్నాయి.బ్యాక్టీరియా చేరిన ఈ నీరు తాగి గ్రామస్తులు అనారోగ్య పాలవుతున్నారు.గత కొంతకాలంగా సాగర్ జలాలను గుండ్లకమ్మకు ఇప్పిస్తామని అధికారులు,ప్రజా ప్రతినిధులు తెలిపిన నేటికి చుక్క నీరు రాని పరిస్థితి నెలకొంది.ఇప్పటికే ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన రైతులకు చుక్క నీరు అందించలేని పరిస్థితి నియోజకవర్గంలో ఏర్పడింది.ప్రభుత్వం చర్యలు తీసుకుంటే కనీసం మంచినీటినైనా గ్రామాలకు అందించిన వారవుతారని వేడుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details