ప్రకాశం జిల్లా గిద్దలూరులో తాగునీటి ఇక్కట్లు ఇప్పటివి కావు.తక్కువ వర్షపాతం మొదలుకుని భూగర్భజలాల క్షీణత,వాగులు,తాగునీటి చెరువులు ఎండిపోవడం వంటి కారణాలతో....ఈ ప్రాంత ప్రజలు మంచి నీళ్ల కోసం యేళ్లుగా కష్టాలు పడుతున్నారు.ఈ సమస్యను గుర్తించిన అప్పటి ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి...తాగునీటి పథకానికి ఎంపీ ల్యాడ్స్ నిధుల కింద2కోట్ల50లక్షల రూపాయలు విడుదల చేశారు.తొమ్మిది గ్రామాలకు సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.గ్రామశివారులోని అటవీప్రాంతంలో...డీప్ బోర్లు వేసి...అక్కడ నుంచి గ్రామాలకు పైపుల ద్వారా నీటిని మళ్లించేందుకు పనులు చేపట్టారు.దాదాపు15చోట్ల డ్రిల్లింగ్ చేసి బోర్లు తవ్వారు.గతేడాది ఏప్రిల్‌లో మొదలైన పనులు...దాదాపుగా పూర్తి అయ్యాయి.మోటార్లు బిగించి విద్యుత్ లైన్లు అనుసంధానం చేశారు.
ప్రధాన పనులన్నీ పూర్తయినా...అక్కడక్కడా ఓవర్‌హెడ్ ట్యాంకు నిర్మాణాలు నిలిచిపోయాయి.పూర్తయిన ట్యాంకులకు పైప్‌లైన్‌లు అమర్చలేదు.కొద్దిరోజులయ్యాక అధికారులు,గుత్తేదారు వాటిని పూర్తిగా మర్చిపోవడం వల్ల పథకం అసంపూర్ణంగానే ఉండిపోయింది.భూగర్భంలో నీళ్లు...వాటిని బయటకు తీసేందుకు పంపులు ఉన్నా.....మిగిలిన చిన్న చిన్న పనులు పూర్తి చేయాలనే చిత్తశుద్ధి అధికారులకు లేకపోవడం వల్ల....ఆ నీళ్లు ఇళ్లకి రావట్లేదని గిద్దలూరు వాసులు బాధపడుతున్నారు.ప్రస్తుతానికి ట్యాంకర్ల ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తున్న నీటినే వాడుకుంటున్నామని తెలిపారు.ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేసే గుత్తేదారుల్లో చాలామంది...స్థానిక నేతలే అని గ్రామస్థులు ఆరోపించారు.ఈ పథకం పరిధిలో ఉన్న9గ్రామాలకూ...ట్యాంకర్ల ద్వారానే నీళ్లు సరఫరా చేస్తున్నారన్నారు.