ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఖాళీ బిందెలు.. నీళ్లు అందేదెన్నడూ..! - ప్రకాశం జిల్లా తాజా వార్తలు

నీరందక ప్రజలు అల్లాడుతున్నారు. రోడ్డుపై నిరసనలు చేశారు. రాకపోకలను నిలిపేసి తమ గోడును వెల్లడించారు. దాహం కూడా తీరని ఆ దీనస్థితి ప్రకాశం జిల్లాలోని ఈ ప్రజలు.. సమస్య తీర్చాలని పాలకులు, అధికారులను వేడుకుంటున్నారు.

water problem at markapuram
ఖాళీ బిందెలు

By

Published : Oct 7, 2020, 5:59 PM IST

నీటి సమస్య తీర్చాలంటూ ప్రకాశం జిల్లాలోని మార్కాపురం మండలం, చింతకుంట గ్రామస్థులు ఆందోళనకు దిగారు. జాతీయ రహదారిపై ఖాళీ బిందెలతో ధర్నా చేపట్టారు. రాకపోకలను నిలిపేశారు. పది రోజులుగా తాగునీరు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

సరఫరా చేస్తున్న ట్యాంకర్లు సరిపోవడం లేదని, ఎన్ని సార్లు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదన్నారు. చేసేదేమీలేక రోడ్డెక్కాల్సిన పరిస్థితి నెలకొందని వివరించారు. ఇప్పటికైనా అధికారులు సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details