WATER: ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలోని మొత్తం 15 పంచాయతీల్లో 34గ్రామాలున్నాయి. వీటిలో 12 గ్రామాలకు కురిచేడు చెరువు నుంచి మంచినీటిని సరఫరా చేస్తున్నారు. మిగిలిన 22గ్రామాల ప్రజల దాహార్తిని తీర్చేందుకు.. 14 ఏళ్ల క్రితం పొట్లపాడులో 60ఎకరాలలో 10కోట్ల రూపాయలు వెచ్చించి మంచినీటి పథకాన్ని నిర్మించారు. ఆ నిర్మాణంలో లోపాలు ఉండటం వల్ల.. నేటికి ఆ గ్రామాలను మంచినీటి సమస్య వెంటాడుతూనే ఉంది.
WATER: కోట్లు ఖర్చు పెట్టినా.. తీరని దాహార్తి - ప్రకాశం జిల్లా తాజా వార్తలు
WATER: కోట్ల రూపాయలను మంచి నీటి సరఫరా కోసం ఖర్చు పెట్టినా... అక్కడి ప్రజల దాహార్తి తీరలేదు. నిరుపయోగంగా మారిన మంచినీటి పథకం వల్ల.. ప్రకాశం జిల్లా కురిచేడు మండల ప్రజలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతియేటా బిల్లులు పెట్టి ప్రజాధనం వృథా చేస్తున్నారే గానీ.. తమ సమస్యకు పరిష్కారం మాత్రం చూపడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మంచినీటి పథకం నిర్మించి 14ఏళ్లైనా.. ఇప్పటివరకు చుక్క నీరు సరఫరా కాలేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోట్ల నిధులు మంజూరు చేసి పనులు చేపట్టినట్లు చెబుతున్నారే గానీ... ఫలితం మాత్రం లేదంటూ వాపోతున్నారు. వారానికి రెండు సార్లు డీప్ బోరు ద్వారా వచ్చే నీటిని.. కిలో మీటర్లు నడిచి వెళ్లి తెచ్చుకుంటున్నామంటున్నారు.
ఏళ్ల తరబడి చెరువును పట్టించుకోకపోవడంతో పిచ్చి చెట్లు పెరిగి అడవిని తలపిస్తోంది. చెరువుకు నీటిని సరఫరా చేసే పైపు లైన్లు సైతం కనుమరుగయ్యాయి. కోట్ల రూపాయలు వెచ్చించినప్పటికీ పథకాన్ని ఉపయోగంలోకి తేవటంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తాగునీటి సమస్యని పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
ఇవీ చదవండి: