Water in the gas cylinder: గ్యాస్ ధరలు పెరిగి సామాన్యుడిపై తడిసి మోపెడవుతున్నా.. తప్పనిసరి పరిస్థితుల్లో కొంటున్నారు. గ్యాస్ బండ కొన్న వినియోగదారుడికి విచిత్ర పరిస్థితి ఎదురయింది. ప్రకాశం జిల్లా చీరాల మండలం రామకృష్ణాపురానికి చెందిన శ్రీనివాసరావు గ్యాస్ బుక్ చేశాడు. వేటపాలెం గ్యాస్ ఏజన్సీ నుంచి సిలిండర్ వచ్చింది. సిలిండర్ వాడిన పది రోజులకే గ్యాస్ అయిపోయింది. ఇంత తొందరగా గ్యాస్ అవ్వడమేంటని చూస్తే... బండలో నుంచి నీళ్లు బయటకు వచ్చాయి. ఈ విచిత్ర పరిస్థితిని చూసి ఇంటిల్లిపాదీ అవాక్కయ్యారు. గ్యాస్ ఏజెన్సీని సంప్రదించగా ఇలాగే కొన్ని సిలిండర్లు వస్తున్నాయని... వేరేది ఇస్తామని చెప్పినట్లు వినియోగదారుడు తెలిపారు.
Water in the gas cylinder: గ్యాస్ సిలిండర్‌లో నీళ్లు... అవాక్కైన వినియోగదారుడు... - Water in the gas cylinder in prakasam district
ప్రకాశం జిల్లాలో ఓ గ్యాస్ వినియోగదారుడికి విచిత్ర పరిస్థితి ఎదురైంది. గ్యాస్ ఏజన్సీ నుంచి సిలిండర్ బుక్ చేసుకుంటే.. అందులో గ్యాస్‌కు బదులుగా నీళ్లు బయటకు వచ్చాయి. ఈ విచిత్ర పరిస్థితిని చూసి ఇంటిల్లిపాదీ అవాక్కయ్యారు. గ్యాస్ ఏజెన్సీని సంప్రదించగా.. వేరేది ఇస్తామని చెప్పినట్లు వినియోగదారుడు తెలిపారు.
Water in the gas cylinder
Last Updated : Nov 26, 2021, 10:36 AM IST