వర్షాల రాకతో చెరువులన్నీ జలకళను సంతరించుకున్నాయి. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో నల్లమల అటవీ ప్రాంతంలో కురిసిన భారీ వర్షానికి చెరువులు నిండాయి. రాచర్ల మండలం నెమలిగుండ్లలోని రంగనాయక స్వామి గుడి వద్దనున్న గుండ్లకమ్మ వాగు వరదనీటితో నిండింది. ఆసియా ఖండంలోనే రెండో అతి పెద్దదైన కంభం చెరువుకు ఒక్కరోజులోనే నాలుగు అడుగుల మేర నీరు చేరి జలకళను సంతరించుకుంది. చెరువుకు నీరు రావడంతో కంభం, బేస్తవారిపేట మండలాల్లోని పలు గ్రామాల్లో తాగునీరు, సాగునీరుకు ఇబ్బందిలేదని ప్రజలు, రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కంభంలో జలకళను సంతరించుకున్న చెరువులు - ప్రకాశం జిల్లా కంభంలో నిండిన చెరువులు
రాష్ట్రంలో వర్షాలు రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో, నల్లమల అటవీ ప్రాంతంలో కురిసిన భారీ వర్షానికి చాలా చెరువులు నిండాయి.
కంభంలో చెరువులు