ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బొబ్బేపల్లి వద్ద కాలువకు గండి.. వృథాగా పోతున్న నీరు - prakasham district latest news

ప్రకాశం జిల్లా బొబ్బేపల్లి వద్ద కాలువకు గండి పడింది. సాగర్ జలాలు వృథాగా పోతున్నాయి. నీటి ప్రవాహం ఇలాగే కొనసాగితే... పంటలు మునుగుతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

canal blast in bobbepalli mandal
వృథాగా పోతున్న నీరు

By

Published : Sep 4, 2020, 3:49 PM IST

ప్రకాశం జిల్లా మార్టూరు మండలం బొబ్బేపల్లి వద్ద కాలువకు గండి పడింది. సాగర్ కాలువ నుంచి వచ్చిన నీరు… రాజుగారిపాలెం - బొబ్బేపల్లి మధ్య నూతలపాడు మైనర్​లో కలుస్తుంది. ప్రవాహం అధికంగా ఉన్న కారణంగా.. నూతలపాడు మైనర్ కాలువకు ఉన్న షట్టర్ పగిలిపోయి పంటకాలువల్లోకి నీరు చేరింది. కాలువ కట్టకు గండిపడి సాగర్ జలాలు వృథాగా పోతున్నాయి. వరద మరీ ఎక్కువ అయితే పంట చేలు ముంపునకు గురవుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details