భవనం పైనుంచి పడి.. వార్డు వాలంటీర్ మృతి! - భవనం పైనుంచి పడి వార్డు వాలంటీర్ మృతి
ప్రకాశం జిల్లా అద్దంకిలో.. 5 అంతస్తుల భవనంపైనుంచి పడి వార్డు వాలంటీర్ షేక్ షాజహాన్ చనిపోయాడు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రకాశం జిల్లా అద్దంకిలో వార్డు వాలంటీర్ అనుమానాస్పదంగా చనిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 5 అంతస్తులు ఉన్న వీఎన్ఎస్ టవర్స్‌పై నుంచి కిందపడి.. షేక్ షాజహాన్ అనే వ్యక్తి మరణించాడు. ఇతను పట్టణంలోని 17వ వార్డు వాలంటీర్‌గా పని చేశాడు. నాలుగో వార్డు పరిధిలోని ఈ భవనంలో.. షాజహాన్ ఇలా చనిపోయి ఉండడంపై దర్యాప్తు కొనసాగుతోంది. గతంలోనూ ఇదే భవనం వద్ద ఇలాగే ఇద్దరు చనిపోయినట్టు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. షాజహాన్ మృతదేహాన్ని పంచనామా నిమిత్తం అద్దంకి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.