ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా నేత శ్రద్ధాంజలి ఫ్లెక్సీలను చించిన దుండగులు

తమ అభిమాన నాయకుడి ఫ్లెక్సీని చింపేశారని, నిందితులపై చర్యలు తీసుకోవాలని వైకాపా నాయకులు డిమాండ్​ చేశారు. తమ అభిమాన నాయకుడు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారని, శ్రద్ధాంజలి తెలుపుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయగా వాటిని చింపేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

vsrcp leaders protest infront police station
శ్రద్ధాంజలి ఫ్లెక్సీలను చించిన దుండగులు

By

Published : Oct 14, 2020, 2:59 AM IST

శ్రద్ధాంజలి ఫ్లెక్సీలను చించిన దుండగులు

ప్రకాశంలోని కారంచేడు మండలం కుంకలమర్రులో వైకాపా జిల్లా కార్యదర్శి జువ్వా శ్రీనివాసరావుకి శ్రద్ధాంజలి తెలుపుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను దుండగలు చించివేశారు. దాంతో ఆయన అభిమానులు, అనుచరులు కారంచేడు పోలీస్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. పర్చూరు నియోజకవర్గ వైకాపా ఇన్​ఛార్జ్​ అనుచరులే ఈ చర్యకు పాల్పడ్డారని అనుమానం వ్యక్తం చేశారు.

ఫ్లెక్సీలు చించిన వారిని కఠినంగా శిక్షించాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుండగులను గుర్తించి త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని ఎస్సై ఆహమ్మద్ జానీ హమీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details