ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామం 14వ వార్డులో ఓటర్ల జాబితాలో మరణించిన వారి పేర్లు తొలగించ లేదంటూ ఇరువర్గాల వాదనల కారణంగా ఎన్నికల ప్రక్రియను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ఇరువురు అభ్యర్థులతో అధికారులను చర్చించిన అనంతరం మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత ఎన్నికల ప్రక్రియను ప్రారంభించారు. అప్పటివరకు క్యూలైన్లలో నిలబడిన ఓటర్లు కొంతమంది తిరిగి వెళ్ళిపోయారు.
ఏల్చూరులో నిలిచిపోయిన ఓటింగ్.. కాసేపటికే.. - ఏల్చూరు తాజా వార్తలు
మరణించిన వారి పేర్లు తొలగించ లేదంటూ ఇరువర్గాల వాదనల కారణంగా సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామం 14వ వార్డులో ఓటింగ్ ప్రక్రియను అధికారులు నిలిపివేశారు. అనంతరం ఇరువురు అభ్యర్థులతో అధికారులను చర్చించిన మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత ఎన్నికల ప్రక్రియను ప్రారంభించారు.
ఏల్చూరులో నిలిచిపోయిన ఓటింగ్