ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలోని వేములపాడు గ్రామంలో... ఒకే వర్గానికి చెందిన 306 ఓట్లను ఎన్నికల జాబితా నుంచి తొలగించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసిన వారు... తమ ఓటు హక్కును ఇప్పుడెలా తీసేస్తారని ప్రశ్నిస్తున్నారు. తొలగించిన ఓట్లలో ఎక్కువ మంది యువకులే ఉన్నారు. పింఛన్ తీసుకుంటున్న వృద్ధుల ఓట్లు, పనుల నిమిత్తం బయటకు వెళ్లిన వారి ఓట్లు తొలగించారు. దీనిపై వివరణ కోరగా అధికారులు స్పందించటం లేదని బాధితులు చెబుతున్నారు. అధికార పార్టీ నేతలే ఈ పని చేశారని ఆరోపిస్తున్నారు.
ఆ గ్రామంలో 306 ఓట్లు తొలగించారు - ప్రకాశంలో ఓట్ల జాబితా వార్తలు
ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత. అలాంటి హక్కును నిర్లక్ష్యంతో కాలరాస్తున్నారు. ఓ గ్రామంలో ఏకంగా 306 ఓట్లను తొలగించారు. అవన్నీ ఓకే వర్గానికి చెందిన ఓట్లు కావడం గమనార్హం.
ఆ ఊరిలో 306 ఓట్లు తొలగించేశారు!