భార్యను కాపురానికి పంపలేదని భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన ప్రకాశం జిల్లా చీరాలలో జరిగింది. కొత్తపేట సచివాలయం-3లో వాలంటీర్‌గా విధులు నిర్వహిస్తున్న వై.నాగేంద్రబాబు(25).. మరో సచివాలయంలో మహిళా సంరక్షణ కార్యదర్శిగా పనిచేస్తున్న యువతిని రెండు నెలల క్రితం గుడిలో ప్రేమ వివాహం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న ఇరు కుటుంబాల పెద్దలు సంప్రదాయ బద్ధంగా వివాహం జరిపిస్తామని... యువతి కుటుంబీకులు ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. తరువాత ఆమెను కాపురానికి పంపకపోవటంతో మనస్తాపం చెందిన నాగేంద్రబాబు ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాధితుల పిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
భార్యను కాపురానికి పంపలేదని భర్త ఆత్మహత్య - chirala latest news
ఇద్దరు ప్రేమించుకున్నారు. పెద్దలకు తెలియకుండా వివాహం చేసుకున్నారు. ఆ విషయం తెలుసుకున్న ఇరు కుటుంబాల సభ్యులు సంప్రదాయబద్ధంగా వివాహం జరిపిస్తామని యువతిని ఇంటికి తీసుకెళ్లారు. తరువాత కాపురానికి పంపకపోవటంతో మనస్తాపం చెందిన ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది
![భార్యను కాపురానికి పంపలేదని భర్త ఆత్మహత్య volunteer suicide in prakasam district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11068202-973-11068202-1616126202378.jpg)
భార్యను కాపురానికి పంపలేదని భర్త ఆత్మహత్య