లాక్డౌన్ నేపథ్యంలో ప్రకాశం జిల్లా చీరాల మండలం రామకృష్ణాపురంలో చేనేత కార్మికులను దాతలు ఆదుకున్నారు. పద్మశాలి ఇంటర్నేషనల్ అసోసియేషన్ విజయవాడ, పీఐడబ్ల్యూఏ చీరాల కమిటీ సభ్యుల ఆర్థిక సహాయంతో 200 కుటుంబాలకు సరకులు పంచిపెట్టారు.
ఈ కిట్లను పీఐడబ్ల్యూఏ చీరాల బ్రాంచి అధ్యక్షుడు శ్రీ డాక్టర్ పున్నారావు, కార్యదర్శి బీసీ కమిషన్ మెంబర్ అవ్వారు ముసలయ్య ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.