ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇంటి పన్నుల స్వాహా.. గ్రామస్థుల ఆందోళన - home tax in prakasham district news

పంచాయతీలో ఇంటి పన్నుల నిధుల గోల్​మాల్​పై ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం దేశాయిపేటలో గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. పంచాయతీలో 2016 నుంచి 2019 సంవత్సరం వరకు ఇంటి పన్నుల నిధులు గోల్​మాల్​పై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు జిల్లా కలెక్టర్​ను కోరుతున్నారు. పన్ను చెల్లించాలంటూ పంచాయతీ అధికారులు డిమాండ్ నోటీసు ఇవ్వడంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎంపీడీఓకు వినతిపత్రం అందజేశారు.

villagers-protest-for-home-tax-
ఇంటి పన్నుల స్వాహాపై గ్రామస్థుల ఆందోళన

By

Published : Jun 15, 2020, 4:47 PM IST

Updated : Jun 15, 2020, 6:58 PM IST

పంచాయతీ కార్యదర్శి, పూర్వపు పంచాయతీ కార్యదర్శి హయాంలో వసూలు చేసిన సుమారు 40 లక్షల ఇంటి పన్నుల నిధులు గోల్ మాల్ జరగడంపై ప్రకాశం జిల్లా దేశాయి పేట గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత మూడు సంవత్సరాలకు సంబంధించి ఇంటి పన్ను చెల్లించాలంటూ గ్రామస్థులకు నోటీసులు ఇవ్వడంపై బాధితులు లబోదిబోమన్నారు. ఈ సమస్యపై అడిగేందుకు పంచాయతీ కార్యాలయానికి గ్రామస్థులు వెళ్లగా, అధికారులు, సిబ్బంది ఎవరు అందుబాటులో లేరు. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న మండల అభివృద్ధి అధికారి, పంచాయతీ కార్యదర్శి కార్యాలయానికి చేరుకున్నారు. నిధుల గోల్​మాల్​ విషయంపై విచారణ జరిపి బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు వావిలాల దాశరధి, కోటి ఆనంద్, ఊటుకూరు వెంకటేశ్వర్లు, అచ్యుతుని బాబురావు, శామ్యూల్​, బాధితులు పింజల సాంబశివరావు పాల్గొన్నారు.

Last Updated : Jun 15, 2020, 6:58 PM IST

ABOUT THE AUTHOR

...view details