ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లెక్కల మాస్టారు కావాలంటూ పాఠశాలకు తాళం! - ప్రకాశం

ప్రభుత్వ పాఠశాలలు బాగా లేవని...మూసివేస్తున్న రోజులివి. అందుకు భిన్నంగా ప్రకాశం జిల్లాలోని ఓ పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడు కావాలంటూ గ్రామస్థులు పాఠశాలకు తాళం వేశారు. తమ పిల్లల చదవు నాశనమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Breaking News

By

Published : Jun 22, 2019, 7:05 AM IST

ప్రకాశం జిల్లా కోమరోలు మండలం రెడ్డిచర్ల గ్రామంలోని ఎంపీయూపీ పాఠశాలలో ముడేళ్లుగా గణిత ఉపాధ్యాయుడు లేరు. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చూసి చూసి ఆగ్రహించిన గ్రామస్థులు ఎస్​ఎఫ్​ఐ ఆధ్వర్యంలో పాఠశాల వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. విద్యార్థులను తరగతి గదుల నుంచి బయటకు పంపించి తాళం వేశారు. 3 ఏళ్ల క్రితం బదిలీ అయిన గణిత ఉపాధ్యాయురాలు డిప్యుటేషన్ పైన ఒంగోలు వెళ్లారు. ఇప్పటి వరకు ఈ పాఠశాలకు ఏ గణిత ఉపాధ్యాయుడిని ఎంఈఓ నియమించలేదు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోలేదని ఈ పని చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. గణిత ఉపాధ్యాయుడిని నియమిస్తారా? లేదా? అంటూ పాఠశాల ముందు ధర్నా చేశారు.

లెక్కల మాస్టారు కావాలంటూ పాఠశాలకు తాళం!
ఇదీ చదవండి:ప్రజావేదిక స్వాధీనం... కలెక్టర్ల సమీక్షకు సన్నద్ధం

ABOUT THE AUTHOR

...view details