ప్రకాశం జిల్లా మార్టూరు మండలం డేగరమూడి గ్రామం ఎస్సీ కాలనీలో జనావాసాల మధ్య గ్రానైట్ పాలిషింగ్ కర్మాగారం ఏర్పాటుకు అధికారులు అనుమతి ఇచ్చినందుకు నిరసనగా... ఒంగోలు కలెక్టరేట్ వద్ద గ్రామస్థులు ధర్నా నిర్వహించారు. ఫ్యాక్టరీ నుంచి వచ్చే ధ్వని , వ్యర్థాలతో తీవ్ర ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని ఆరోపించారు. ఫ్యాక్టరీ యజమానులకు అనుకూలంగా వ్యవహరించిన గ్రామ కార్యదర్శి పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
'మా ఊరిలో గ్రానైట్ పాలిషింగ్ కర్మాగారం వద్దు' - ప్రకాశం జిల్లా
ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ వద్ద డేగరమూడి గ్రామస్థులు ధర్నా నిర్వహించారు. తమ ఊరిలో గ్రానైట్ పాలిషింగ్ కర్మాగారం వద్దని డిమాడ్ చేశారు.
గ్రామస్థుల ధర్నా
ఇవీ చదవండి..