ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గోమాతకు భక్తిశ్రద్ధలతో అంత్యక్రియలు - latest news in prakasam district

తమ ఊరిలో కొలువైన పరమేశ్వరునితో పాటు.. ఆలయంలోని గోమాతను దైవంగా భావించి ఆరాధించారు ఆ ఊరి ప్రజలు. నిత్యం పూజించిన.. ఆ గోవు అనారోగ్యంతో మృతి చెందితే .. అంతే భక్తిశ్రద్ధలతో అంత్యక్రియలు నిర్వహించారు.

Funeral for Gomata
గోమాతకు అంత్యక్రియలు

By

Published : Jul 12, 2021, 3:57 PM IST

గోమాతకు అంత్యక్రియలు

ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం చెన్నంపల్లి గ్రామంలో గోమాతకు గ్రామస్థులు అంత్యక్రియలు నిర్వహించారు. 2004లో ఆలయ పునర్నిర్మాణం సందర్భంగా గ్రామానికి చెందిన గుంటుపల్లి కోటేశ్వరరావు శివాలయానికి గోమాతను అందించారు. నాటి నుంచి నేటి వరకు గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో గోమాతను పూజించే వారు.

ఆ గోమాత అనారోగ్యంతో నిన్న మృతి చెందింది. ఈ మేరకు గోవుకు ఆలయం వద్ద పూజల అనంతరం మేళతాళాలతో ట్రాక్టర్​పై గ్రామోత్సవం నిర్వహించారు. మహిళలు కొబ్బరికాయలు కొట్టారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details