ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైద్యురాలి ప్రవర్తన నిరసిస్తూ గ్రామస్థులతోపాటు సిబ్బంది ఆందోళన - prakasham general hospital news update

ప్రకాశం జిల్లాలో వైద్యురాలిగా పనిచేస్తున్న హైమావతి సిబ్బంది, రోగులతో అనుచితంగా ప్రవరిస్తున్నారని ఆరోపిస్తూ వైద్యశాల సిబ్బంది ఆందోళనకు దిగారు. దీనిపై ఈటీవీ కథనం ప్రచురించడంతో స్పందించిన డిప్యూటీ డీఎంహెచ్​ఓ ప్రియంవద విచారణ చేపట్టారు.​

villagers and staff Allegations against doctor
వైద్యురాలిపై అరోపణలు గ్రామస్థులతోపాటు సిబ్బంది అందోళన

By

Published : Jun 15, 2020, 4:39 PM IST

ప్రకాశం జిల్లా కనిగిరి నియోజక వర్గంలోని వెలిగండ్ల మండలం నాగిరెడ్డిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యురాలుగా విధులు నిర్వహిస్తున్న హైమావతి తమపై అనుచిత వ్యాఖ్యలు చేశారని వైద్యశాల ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు ఆరోపించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులను సైతం అసభ్య పదజాలంతో తిడుతున్నారని, ప్రశ్నిస్తే దాడి చేస్తోందని గ్రామస్థులు సైతం ఆరోపించారు. వైద్యురాలి ప్రవర్తనకు నిరసనగా సిబ్బంది విధులు బహిష్కరించి ఆరోగ్య కేంద్రం బయట ధర్నా చేశారు. ఈ ధర్నాకు గ్రామస్థులు సైతం మద్దతుగా నిలిచారు. ఈ విషయంపై ఈటీవీలో ప్రచారం చేయడంతో స్పందించిన జిల్లా డిప్యూటీ డీఎంహెచ్ఓ ప్రియంవద వైద్యశాలకు సందర్శించి విచారణ చేపట్టారు.

ఇవీ చూడండి...ప్రకాశం జిల్లా కలెక్టరేట్​లో ఆటోమెటిక్‌ థర్మల్‌ స్కానర్‌ ఏర్పాటు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details