Minister Adimulapu Suresh: వచ్చే ఎన్నికల్లో నూతనంగా నియమించే పార్టీ కన్వీనర్లు, గృహ సారథులదే కీలక బాధ్యత అని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు వద్ద మండల స్థాయి వైసీపీ కన్వీనర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ నాయకులు, కన్వీనర్లు, వాలంటీర్లు పాల్గొన్నారు. పార్టీపరంగా సమావేశం జరిగినా.. వాలంటీర్లు అన్ని గ్రామాల నుంచి తప్పకుండా హాజరుకావాలని మండలం పరిషత్ కార్యాలయం నుంచి సర్క్యులర్ జారీ చేశారు.
వాలంటీర్లు హాజరయ్యారా లేదా అనే విషయం మంత్రి వ్యక్తిగత సిబ్బందికి పంచాయతీ కార్యదర్శులు సమాచారం ఇవ్వాలని.. ఆ సర్క్యులర్లో పేర్కొన్నారు. దీంతో ఈ సమావేశానికి అందరూ వాలంటీర్లు పాల్గొని మీటింగ్ వద్ద గ్రూప్ ఫోటోలు దిగి సమావేశానికి వచ్చినట్లుగా హాజరు వేయించుకున్నారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి సురేష్ జనసేన అధినేత పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడుపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.