ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వాలంటీరే.. అప్పుడప్పుడు ఉన్నతాధికారుల్లా అవతారమెత్తుతాడు!

అతడు గ్రామ వాలంటీరే.. కానీ అవసరాన్ని బట్టి.. ఉన్నతాధికారుల్లా అవతారమెత్తుతాడు. వీలును బట్టి.. మోసాలు కూడా చేసేస్తాడు. ఓ ఎస్సై స్టేషన్​లో లేని సమయంలో ఎస్సై అవతారమెత్తి అడ్డంగా దొరికిపోయాడు. ఇప్పుడు కటకటాల పాలయ్యాడు.

village volunteer fraud in prakasham district kurichedu
village volunteer fraud in prakasham district kurichedu

By

Published : Apr 20, 2021, 10:50 PM IST

నేనే కలెక్టర్, పోలీస్, పంచాయతీ సెక్రటరీ.. ఇలా కావాల్సిన గెటప్​ల్లోకి వెళ్లిపోతాడు. ఎందుకంటారా? మోసాలకు ఉన్నత అధికారుల పదవులను అడ్డుపెట్టుకునేందుకు. అతడి పేరు అఖిల్. గ్రామ వాలంటీర్​గా పని చేస్తున్నాడు. ప్రకాశం జిల్లా కురిచేడులో ఎస్సై ఎన్నికల విధుల్లో ఉన్న సమయంలో.. ఆ స్టేషన్​కు వెళ్లి.. ఎస్సై అవతారమెత్తాడు. చివరకు దొరికి.. జైలు పాలయ్యాడు.

ప్రకాశం జిల్లా కురిచేడుకు చెందిన అఖిల్ అనే యువకుడు వాలంటీర్​గా విధులు నిర్వహిస్తున్నాడు. గతంలో రాజమండ్రిలో ఓ మహిళను తీసుకువెళ్లి బంగారు షాపు యజమానికి జాయింట్ కలెక్టర్​కు కాబోయే భార్య అని పరిచయం చేశాడు. ఆమెకు అప్పుగా ఆరు లక్షల రూపాయల బంగారాన్ని అప్పుగా ఇప్పించాడు. ఇంకేం.. యజమానికి టోకరా వేశాడు. షాపు యజమాని చాకచక్యంగా వ్యవహరించి.. అఖిల్​ను అతడితో వచ్చిన మహిళను పోలీసులకు పట్టించాడు.

కొన్ని రోజుల తర్వాత.. కురిచేడులో గ్రామంలోని చాలామందికి పెన్షన్ ఇప్పిస్తానని చెప్పి.. రూ.2.5 లక్షల వరకు దోచుకున్నాడు. అయితే ఈ ఘటన వెలుగులోకి రావడంతో రాజకీయ నాయకుల అండదండలతో బయటపడ్డాడు. వాలంటీర్ పోస్ట్ కూడా పోకుండా మేనేజ్ చేసుకున్నాడు. ఇటీవలే అఖిల్​కు కురిచేడు ఎస్సై సీటుపై కన్ను పడినట్టుంది.. ఎస్సై, సిబ్బంది లేని సమయం చూసి.. సీట్​లో కూర్చొని ఫొటోలకు ఫోజులు ఇచ్చాడు. ఈ విషయంతోపాటు గతంలోని చరిత్ర కూడా తెలిసిన పోలీసులు.. అఖిల్​ను అరెస్టు చేశారు.

ఇటీవల పింఛనుదారుల నుంచి బయోమెట్రిక్ ద్వారా వేలిముద్రలు వేయించుకుని సొమ్ము దోచేసినట్లు అధికారులు గుర్తించారు. అంతేకాదు.. ఒక్కసారి ఎమ్మార్వోగానూ.. అవతారమెత్తాడు. అఖిల్​పై రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నట్లు సమాచారం.

ఇదీ చదవండి:'కరోనాపై కలిసి పోరాడదాం- లాక్​డౌన్ చివరి అస్త్రమే'

ABOUT THE AUTHOR

...view details