ప్రకాశం జిల్లా అద్దంకిలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, తూనికలు కొలతల అధికారులు సంయుక్తంగా దుకాణాలపై దాడులు చేశారు. విజిలెన్స్ సీఐ బీటీ నాయక్, తూనికలు, కొలతల అధికారి కొండారెడ్డి ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. నిత్యావసరాలను ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే ఎక్కువకు విక్రయిస్తున్న 5 షాపులపై కేసులు నమోదు చేశారు. మెడికల్ షాపుల్లో తనిఖీలు చేసి.. మాస్కులు, శానిటైజర్ల ధరలను పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
అద్దంకిలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు - vigilance officers siezed general shops in addanki
ప్రకాశం జిల్లా అద్దంకిలో నిత్యావసరాలను.. ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే ఎక్కువకు విక్రయిస్తోన్న దుకాణాలపై విజిలెన్స్ అధికారులు కొరడా ఝుళిపించారు. నిబంధనలు పాటించని షాపులపై కేసులు నమోదు చేశారు.
అద్దంకిలో దుకాణాల్లో విజిలెన్స్ అధికారుల తనిఖీలు