'అవకతవకలు జరిగితే చర్యలు తప్పవు'
ప్రకాశం జిల్లా చిన్నగంజాంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. గోదాముల్లో నిల్వలు పరిశీలించారు.
విజిలెన్స్ అధికారుల తనిఖీలు
ప్రజలకు పంపిణీ చేసే సరుకుల్లో ఎలాంటి అవకతవకలు జరిగినా... సహించబోమని ప్రకాశం జిల్లా విజిలెన్స్ డిప్యూటీ కలెక్టర్ మల్లేశ్వరరావు సిబ్బందిని హెచ్చరించారు. చిన్నగంజాంలోని పౌరసరఫరాల శాఖ గిడ్డంగుల్లో నిల్వలపై ఆకస్మిక తనీఖీలు చేశారు. కార్యాలయంలో దస్త్రాలు పరిశీలించిన డిప్యూటి కలెక్టర్ ... గోదాముల్లో సరకు నిల్వను తనిఖీ చేశారు.