ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం వెలుగు కార్యాలయంలో విషాదం చోటు చేసుకుంది. వెలుగు సీసీ నాగేశ్వరరావు కార్యాలయంలోని కిటికికి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కారణాలు.. లేక ఆరోగ్య సమస్యలతోనే ఉరేసుకుని ఉంటాడనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పలు కోణాల్లో పరిశీలిస్తున్నారు. నాగేశ్వరరావుతో పని చేస్తున్న ఉద్యోగులు మాత్రం ఆరోగ్య సమస్యతోనే ఉరి వేసుకొని ఉంటాడని చెబుతున్నారు. అసలు విషయంపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ఉరేసుకుని వెలుగు అధికారి ఆత్మహత్య.. ఎందుకంటే..! - బల్లికురవలో వెలుగు అధికారి ఆత్మహత్య
కుటుంబ కలహాలో లేక ఆరోగ్య సమస్యో తెలియదు కానీ.. ఓ అధికారి వెలుగు కార్యాలయంలోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

velugu CC officer attempt sucide by hanging at Ballikurava mandal in prakasham