ప్రకాశం జిల్లా వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులు గ్రామ సభలను అడ్డుకున్నారు. నిర్వాసితుల ప్యాకేజీ అమలు విషయంలో రెవెన్యూ అధికారులు గ్రామసభలు నిర్వహించేందుకు గ్రామాలకు బయలుదేరారు. ప్రాజెక్టు పరిసర గ్రామాలైన దరిమడుగు, సుంకేసులు, కలనుతల, గుండంచర్ల గ్రామాల్లో సభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. గత సర్వేల్లో తప్పులున్నాయని, ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు ఎకరాకు రూ.20 లక్షలు పరిహారం చెల్లించాలని నిర్వాసితులు డిమాండ్ చేశారు.
ఇటీవల విడుదల చేసిన ఉత్తర్వుల్లో ఎకరాకు రూ.12.50 లక్షలు మాత్రమే ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధం అయ్యిందని ఆరోపించారు. ఈ ప్యాకేజీని వ్యతిరేకిస్తున్నామని గ్రామస్థులు చెప్పారు. అందుకు నిరసనగా గ్రామసభలను అడ్డుకున్నామన్నారు. సర్వేలో తప్పులను సరిచేసిన తర్వతే గ్రామసభలు నిర్వహించాలని కోరారు. సభలకు వస్తున్న అధికారులను అడ్డుకుని వెనక్కి పంపారు.