ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆగస్టు 31 నాటికి వెలిగొండ పనులు పూర్తవ్వాలి' - veligonda project latest news

వెలిగొండ ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలని అధికారులను ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ఆదేశించారు. 2021 ఆగస్టు 31 నాటికి పనులు పూర్తి చేసి ప్రజలకు తాగు, సాగునీరు అందించడానికి చర్యలు తీసుకోవాలన్నారు.

prakasam collector
prakasam collector

By

Published : Nov 20, 2020, 4:35 PM IST

వెలిగొండ ప్రాజెక్టు పనులను వచ్చే ఏడాది ఆగస్టు 31 నాటికి పూర్తి చేయాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ అధికారులను ఆదేశించారు. దోర్నాల మండలంలోని వెలిగొండ ప్రాజెక్టు ఇంజినీరింగ్ కార్యాలయంలో రెవెన్యూ, ప్రాజెక్టు అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు నిర్మాణ పనులు, పునరావాస కేంద్రాల ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు. వెలిగొండ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.

శ్రీశైలం డ్యాంలో వరద ప్రవాహం ఎక్కువగా ఉన్నందున పనుల్లో జాప్యం జరుగుతోందని అధికారులు తెలియజేశారు. 2021 ఆగస్టు 31 నాటికి పనులు పూర్తి చేసి ప్రజలకు తాగు, సాగునీరు అందించడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టు మెదటి సొరంగం, హెడ్ రెగ్యులేటర్ పనులు డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అలాగే రెండో సొరంగం పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. వెలిగొండ ప్రాజెక్టు కాలువల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ పూర్తి చేయాలని కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.

ABOUT THE AUTHOR

...view details